ETV Bharat / city

'థర్మల్ విద్యుత్ భారం భరించలేక పోతున్నాం... వెనక్కిచ్చేస్తాం' - central alligations on ap latest news

థర్మల్‌ విద్యుత్‌ భారం భరించలేకపోతున్నామని.. ఏపీ ట్రాన్స్‌కో కేంద్ర విద్యుత్‌ శాఖకు లేఖ రాసింది. 675మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ను వెనక్కు ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. సౌర విద్యుత్‌ ధరతో పోలిస్తే.. తాప విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని...ఇది పంపిణీ సంస్థలపై భారం పడుతోందని లేఖలో పేర్కొంది. తమిళనాడులోని కుడిగి, కర్ణాటకలోని వల్లూరు విద్యుత్‌ ప్లాంట్ల నుంచి కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దుచేయాలని కొద్దిరోజుల కిందట ఏపీ ట్రాన్స్‌కో మరో లేఖ రాసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

ap transco
'థర్మల్ విద్యుత్ భారం భరించలేక పోతున్నాం... వెనెక్కిచ్చేస్తాం'
author img

By

Published : Jun 30, 2020, 4:46 AM IST

Updated : Jun 30, 2020, 8:15 AM IST

సౌర, థర్మల్‌ విద్యుత్‌ కలిపి బండిల్డ్‌గా కొనుగోలు చేయటం వల్ల ధర పెరుగుతుండటంతో 675 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను వెనక్కి ఇచ్చేస్తామని ఏపీ ట్రాన్స్‌కో స్పష్టంచేసింది. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలపై పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా ఇందుకు అనుమతించాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి.. ట్రాన్స్‌కో ఎండీ శ్రీకాంత్‌ మే14న లేఖ రాశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ పథకం కింద ఎన్టీపీసీ నుంచి రాష్ట్రానికి 1300 మెగావాట్ల సౌర విద్యుత్‌.... 675 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. మూడేళ్లుగా సౌర విద్యుత్‌ కంటే బండిల్డ్‌ విద్యుత్‌ ధర అధికంగా ఉంటోంది. 2019-20లో థర్మల్‌ విద్యుత్‌ ధర సగటున యూనిట్‌కు 5రూపాయల 3 పైసలు అవుతోంది. అదే బండిల్డ్‌ విద్యుత్‌ కొనుగోలుకు సగటున యూనిట్‌కు 4రూపాయల 85పైసలు అవుతోంది. సౌర విద్యుత్‌ ధర యూనిట్‌కు 4రూపాయల 63పైసలు ఉంది. అంటే సౌర విద్యుత్ ధర కంటే బండిల్డ్‌ ధర అధికంగా ఉందని లేఖలో తెలిపారు. నిబంధనల ప్రకారం సౌర విద్యుత్‌ ధర కంటే బండిల్డ్‌ విద్యుత్‌ ధర ఎక్కువగా ఉంటే అధికంగా ఉన్న థర్మల్‌ విద్యుత్‌ను సరెండర్‌ చేసే వెసులుబాటు లబ్ధిదారుకు ఉంటుందన్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని పరిగణలోకి తీసుకుని జేఎన్ఎన్ఎస్​ఎం ఫేజ్‌-2 కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 675 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ను వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు.

కుడిగి, వల్లూరు ఒప్పందాలు రద్దు చేసుకుంటాం...

కర్ణాటకలోని కుడిగి, తమిళనాడులోని వల్లూరు ప్లాంట్ల నుంచి కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ ట్రాన్స్‌కో కొన్నాళ్ల కిందట మరో లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేంద్రాల నుంచి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు అదనంగా కుడిగి కేంద్ర నుంచి 385 మెగావాట్లు, వల్లూరు కేంద్ర నుంచి 88 మెగావాట్ల బండిల్డ్‌ విద్యుత్‌ను ఎన్టీపీసీ కేటాయించింది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ ధర యూనిట్‌కు 10 రూపాయల వరకు అవుతోంది. దీనివల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ కారణంగా కుడిగి, వల్లూరు ప్లాంట్ల నుంచి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ట్రాన్స్‌కో కేంద్రానికి రాసిన లేఖలో కోరారు.

ఇవీ చూడండి-ప్రతిధ్వని: కరోనా ప్రభావం.. స్వీయ రక్షణే కీలకం

Last Updated : Jun 30, 2020, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.