ETV Bharat / city

ప్రధానవార్తలు @1PM

..

1PM TOP NEWS
ప్రధానవార్తలు @1PM
author img

By

Published : Jul 31, 2022, 12:59 PM IST

  • 'సోషల్​ మీడియా అకౌంట్ల డీపీ మార్చుకోండి'.. ప్రజలకు మోదీ పిలుపు

ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్​ మీడియా ఖాతాల ప్రొఫైల్​ పిక్చర్​గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమం ఓ సామూహిక ఉద్యమంగా మారడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు.. 'చనిపోయినా సరే.. ఎవరికీ లొంగను'

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు ఆదివారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండు సార్లు ఈడీ సమన్లు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. పాత్రచాల్ ​భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్​ వేదికగా ఈ దాడులపై స్పందించారు సంజయ్ రౌత్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రుచి చూడాల్సిందే.. ఓ పట్టు పట్టాల్సిందే'

మారుతున్న కాలానికి తగ్గట్టుగా భోజనప్రియుల అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం పెరగడంతో, నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లకు గిరాకీ పెరిగింది. విజయవాడ నగరంలో ఎన్ని హోటళ్లు పెట్టినా.. భోజనప్రియుల ఆదరణ ఉంటోంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆహార సంస్థలన్నీ విజయవాడకు తరలివచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తాళికట్టు 'శ్రావణ' వేళ.. మెడలో 'కల్యాణ' మాల..!

తెలంగాణలో నేటి నుంచి భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. శ్రావణమాసం రావడంతో ఆగస్టు నెలలో పెద్ద సంఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు. ఈ ముహూర్తాలు దాటితే.. మళ్లీ నాలుగు నెలల వరకు మంచి ఘడియలు లేకపోవడంతో ఉన్న ఈ శుభ ముహూర్తాల్లోనే తమ పిల్లలను ఓ ఇంటివారిని చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చీకోటి ప్రవీణ్‌ క్యాసినో దందాపై కూపీ లాగుతోన్న ఈడీ.. డొంకంతా కదిలేనా..?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ సాగుతోంది. ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్‌తో రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలపై ఈడీ దృష్టి సారించింది. హవాలా మార్గం ద్వారా డబ్బులు విదేశాలకు తరలించడంతో పాటు ప్రవీణ్ దందాలో ప్రముఖుల పాత్రపై ఆరా తీస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏనుగుల బీభత్సం.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు.. ఎక్కడంటే..?

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీభత్సం సృష్టించాయి. గజరాజుల గుంపు దాడిలో ఒకరు ప్రాణాలు పోగొట్టున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి తమిళనాడు అడవుల్లో నుంచి ఏపీ పరిధి గుడిపల్లె మండలం చిగురుగుంట అటవీ ప్రాంతానికి చేరుకున్న గజ రాజులు ఇద్దరిపై దాడి చేశాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన ఇళ్లు.. 25 మంది మృతి

అమెరికాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 25 మందికిపైగా మరణించారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. పాకిస్థాన్​లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద సంబంధిత ఘటనల్లో లాహోర్​, సింధ్​, బలోచిస్థాన్​లో పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ నిర్ణయం తప్పు.. పన్ను ఎగ్గొట్టేందుకు గోల్డ్​ స్మగ్లింగ్ పెరగొచ్చు'

బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల పసిడి స్మగ్లింగ్ పెరగవచ్చని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ ఎం.పి. అహ్మద్ అన్నారు. దీని వల్ల సంస్థాగత ఆభరణాల రంగంపైనా ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్‌​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను అహ్మద్ తెలిపారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చెక్ బౌన్స్ కేసులో ధోనీకి ఊరట

చెక్ బౌన్స్ వివాదంలో చిక్కుకున్న టీమ్​ఇండియా మాజీ సారథి, ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ధోనీకి ఊరట లభించింది. బిహార్​లో ధోనీపై చెక్ బౌన్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ధోనీతో పాటు మరో నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సల్మాన్​​- కియారా అడ్వాణీ కుటుంబాల మధ్య సంబంధం గురించి.. మీకు తెలుసా?

బాలీవుడ్​లో వరుస హిట్లతో దూసుకుపోతోంది బాలీవుడ్​ హాట్​ బ్యూటీ కియారా అడ్వాణీ. తాజాగా 'జుగ్ జుగ్ జివో' బ్లాక్​ బస్టర్​తో దూకుడు మీద ఉంది. ప్రస్తుతం శంకర్​- రామ్​చరణ్​ పాన్​ మూవీలో నటిస్తోంది. ఆదివారం(జులై 31) కియారా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.