- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం..
76వ స్వాతంత్య్ర వేడుకలకు రాష్ట్రం ముస్తాబైంది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో సీఎం జాతీయ జెండా ఎగరవేయనున్నారు. గుంటూరులో జరిగే వేడుకల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటారు. స్వాతంత్ర్యోత్సవ వేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, వివిధ కూడళ్లను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు రాష్ట్రప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ..వారిని విడుదల చేయాల్సిందింగా హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్ర డిస్కంలను రెడ్ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు- డిస్కంలను... కేంద్ర ప్రభుత్వం రెడ్ కేటగిరీలో చేర్చింది. వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన 11వేల 149 కోట్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచడమే ఈ చర్యకు కారణమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వారిని తలుచుకుంటే భయమేస్తుందన్న పవన్
అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పదవి వెతుక్కుంటూ రావాలే గానీ పదవి వెంట పడకూడదన్న జనసేనాని.. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా రావాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంచి నీటి కుండను ముట్టాడని దళిత విద్యార్థిపై టీచర్ దాడి, చికిత్స పొందుతూ మృతి
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. నీటి కుండను ముట్టాడని దళిత విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. దీంతో బాలుడు చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశ విభజన వేళ ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని నివాళులు..
'విభజన విషాద స్మృతి దినం' సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ, భాజపా సీనియర్ నేతలు నివాళులు అర్పించారు. నాటి విషాదకర సమయంలో బాధలకోర్చి నిలబడిన వారి మొక్కవోని ధైర్యం ప్రశంసనీయమని మోదీ ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాళవిక మోహనన్ అందాల జాతర, మానుషి హాట్ ట్రీట్..
తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తమ కొత్త ఫొటోషూట్స్‌తో హీట్ పెంచారు. ఇవి సోషల్ మీడియాలో నెటిజన్లకు చెమటలు పట్టిస్తున్నాయి. వాటిని మీరూ చూసేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్‌లో ఇరగదీస్తున్న పుజారా, వన్డేల్లో వరుసగా రెండో సెంచరీతో విధ్వంసం..
భారత క్రికెటర్, టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ కప్ వన్డే ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టు తరఫున వరుసగా రెండో సెంచరీ చేయడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ కంపెనీల షేర్లతో కాసుల పంట పండించిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. ఈక్విటీల్లోకి ఎంటర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఆయన వ్యూహాలు, పెట్టుబడుల తీరుపై కంప్యూటర్లలో వెతక్కుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు గురించి ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్రిటన్ ప్రధాని పదవి రేసులో లిజ్ ట్రస్ ముందంజ, రిషికి కష్టమేనా
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో ఉన్న రిషి సునాక్, సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థి లిజ్ ట్రస్‌తో పోలిస్తే వెనుకంజలో కొనసాగుతున్నారు. ఒపీనియమ్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో 570 మంది కన్జర్వేటివ్ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈ సర్వేలో లిజ్ ట్రస్‌కు 61 శాతం, రిషి సునాక్‌కు 39 శాతం మద్దతు లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.