- చరిత్ర సృష్టించిన ఆదివాసీ మహిళ.. భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం
భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపదీ ముర్ము. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఘనంగా జరిగింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- రాష్ట్రపతిగా నా ఎన్నిక.. దేశ పేదలందరి విజయం: ముర్ము
భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం తన ఒక్కరి ఘనత కాదని.. దేశ ప్రజలందరి విజయమని అన్నారు ద్రౌపదీ ముర్ము. పేదలు కలలు కనొచ్చని, వాటిని నిజం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే నిదర్శనం అన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- వలలో చిక్కి.. విలవిల.. అతివల వ్యక్తిగత చిత్రాల మార్ఫింగ్
తరతరాలుగా వేళ్లూనుకుపోయిన సమాజ కట్టుబాట్లను ఛేదించుకొని.. ఇప్పుడిప్పుడే హక్కులు, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు మహిళలు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగటంతో.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలను సైతం అతివలు ఉపయోగిస్తున్నారు. కానీ కొందరు మోసగాళ్లు మాత్రం.. నకిలీ ఐడీలతో యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- అంతర్రాష్ట్ర హంతక ముఠా అరెస్టు.. తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లు
తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక పిస్తోలు, 16 తూటాలు, 3 వాహనాలతోపాటు రూ.6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- ‘బోద..’ బతుకంతా వ్యథ.. పెదపెంకిని పీడిస్తున్న వ్యాధి
అడుగు తీసి అడుగు వేయాలంటే నరకం.. పెద్దపెద్ద బండలు కాళ్లకు కట్టుకుని మోసినట్లు ఉంటుంది.. శరీరాన్ని మెలి పెడుతున్నంతగా నొప్పులు. చలి జ్వరం వచ్చిందంటే నాలుగైదు దుప్పట్లు కప్పుకొన్నా వణుకు ఆగదు. పండగ.. పబ్బం ఉండదు.. మంచంపైనే జీవనం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామంలో వందలాది మంది నిత్యం పడే బోద కాలు వ్యాధి బాధలివి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వెనుకంజ!
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బయటి నుంచి వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. స్థానిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినా వివిధ కారణాలతో ప్రభుత్వమే వారిని నిరాశపరుస్తుందనే విమర్శలొస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల్లో భూములను కేటాయిస్తే.. తక్కువ ధరకు కేటాయించారన్న పేరుతో వాటిని రద్దు చేయడమే ఎజెండాగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పని చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా.. 17 మంది మృతి
హైతీ వలసదారులతో ప్రయాణిస్తున్న బోటు బహమాస్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 17మంది మరణించారు. సముద్రం నుంచి బహమియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. బోటులో ఉన్న 25 మందిని రక్షించినట్లు బహమాస్ అధికారులు తెలిపారు. న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- ఇన్ఫోసిస్ క్యూ1 లాభం రూ.5,360 కోట్లు.. గతేడాది కంటే 3.2% అధికం
సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, జూన్ త్రైమాసికానికి రూ.5,360 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.5,195 కోట్ల కంటే ఇది 3.2% అధికం. అయితే ఆర్థిక అనిశ్చితి వాతావరణంలోనూ పటిష్ఠ ఫలితాలు ప్రకటించడం ఇన్ఫోసిస్ సామర్థ్యాలకు నిదర్శమని సంస్థ ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.
- దిగ్గజాలకే చెమటలు పట్టించిన బౌలర్.. కానీ ఇప్పుడు..
ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అని పెద్దలు ఊరికే అనలేదు. విధిరాత ఎలా రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు. ముందు క్షణం వరకూ రాజులా ఓ వెలుగు వెలిగినవారే .. మరుక్షణమే బికారి అవుతారని ఎవరన్నా ఊహించగలరా..? అందుకే విధి ఆడే వింతనాటకంలో మనమంతా పావులం అని కవులు చెబుతుంటారు. ఇంతకీ ఇదంతా ఎందుకో అని అడుగుతారా..? అయితే అదేంటో తెలియాలంటే మాత్రం ఇది చదవాల్సిందే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ సూపర్ హిట్ షోలో సుమ కూతురి సీక్రెట్ ఎంట్రీ.. వారికి రూ.లక్షల సాయం!'
కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరదాగా సాగిపోయే ఆటపాటలు, సరదా ప్రశ్నలు, అప్పుడప్పుడు కంటతడి పెట్టంచే ఎమోషన్స్ ఇలా ఎంటర్టైన్మెంట్ చేసే షో 'క్యాష్'. అయితే ఈ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా చేస్తున్న సుమ.. ఓ సీక్రెట్‌ను బయటపెట్టారు. తాను చేస్తున్న స్టార్ మహిళ షోలో తన కూతురిని రహస్యంగా ఉంచి ఎవరికీ కనిపించకుండా కార్యక్రమాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిస్ చేయండి.