- 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదల.. టాప్-1గా పిఠాపురం వాసి
రాష్ట్రంలో 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను విజయవాడలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పేదరికం నుంచి బయటపడాలంటే.. చదువు అవసరం: సీఎం జగన్
రాష్ట్రంలో పేదరికమనే సంకెళ్లు తెంచుకోవాలనే ఉద్దేశంతోనే విద్యారంగంపై ఎక్కువ ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మూడో విడత జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. బైజూస్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు నమోదు
నరసాపురం ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మురుగు కాలువలోకి దిగి వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన..ఎందుకంటే..!
వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి.. నెల్లూరు నగరం ఉమారెడ్డి గుంట మురుగు కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఖైదీలంతా విడుదల!
జైళ్లలో సత్ప్రవర్తన కనబరుస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అనేక మందికి కారాగారవాసం నుంచి విముక్తి కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి.. రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నుపుర్'కు మద్దతుగా సీజేఐకి మాజీ జడ్జిల లేఖ.. సుప్రీం వ్యాఖ్యలపై అసంతృప్తి
భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, సైనికాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు సీజేఐ జస్టిస్ రమణకు బహిరంగ లేఖ రాశారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా న్యాయమూర్తిని ఆదేశించాలని లేఖలో కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ దేశం నుంచి రెండేళ్ల తర్వాత విమానాల రయ్రయ్.. భారత్‌కు నో!
రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనుంది చైనా. అమెరికా సహా 125కు పైగా దేశాలతో విమాన సర్వీసులను క్రమబద్ధీకరించగా.. భారత్ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,000గా ఉండగా.. కిలో వెండి ధర రూ.60,130కు చేరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కడువా, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన 'హ్యాపీ బర్త్‌డే'తో పాటు మరికొన్ని సినిమాలు ఈ వారమే థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటితో పాటు పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు కూడా థియేటర్, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం- భారత్‌తో సిరీస్ సమం
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్‌పై 7 వికెట్ల తేడాతో స్టోక్స్ సేన గెలిచింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.