- కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌కు జీవితఖైదు
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌కు శిక్ష ఖరారయ్యింది. ఈ మేరకు యావజ్జీవ శిక్ష విధిస్తూ దిల్లీ పటియాల కోర్టు తీర్పును వెలువరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- రావులపాలెంలో ఉద్రిక్తత.. ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
కోనసీమలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వాహనంపై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని రావులపాలెం రింగ్‌రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- దాడులు ఆపడంలో పోలీసులు విఫలం... అంబేడ్కర్ జిల్లా సాధన సమితి
అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని.. అంబేడ్కర్ జిల్లా సాధన సమితి నాయకులు అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- చంద్రబాబుకు వచ్చే ఆదరణను చూసి ఓర్వలేకే.. : బుద్ధా వెంకన్న
వైకాపా ప్రభుత్వం.. మహానాడుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని తెలుగుదేశం నేతలు విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మహానాడుకు.. ప్రయాణ ఏర్పాట్లకు సైతం ఆటంకాలు కలిగిస్తోందని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- స్నేహితుడే.. కానీ చంపేశారు... ఏమైందంటే..!
వారు ముగ్గురూ స్నేహితులు. ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. గొడవలు, కొట్లాటలు వాళ్లకు సహజం. కానీ ఈసారి జరిగిన గొడవ మాత్రం ఓ స్నేహితుడి ప్రాణాలు బలిగొంది. ఎందుకో తెలుసా...పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కోసం పాక్ కుళ్లు రాజకీయం
జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను తక్షణమే నిర్దోషిగా ప్రకటించి.. జైలు నుంచి విడుదల చేయాలని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ఐరాస మానవహక్కుల హైకమిషనర్‌కు లేఖ రాశారు. కశ్మీరీలను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఆరుగురు సజీవదహనం
ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన జరిగింది. ఉత్తరకాశీ వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి హైవే పక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- జీవిత బీమా గురించి కుటుంబ సభ్యులకు చెప్పారా? లేదంటే...
భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది జీవిత బీమాకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది ఓ రకంగా మంచిదే అయినా.. కొందరు అసలు ఆ బీమా తీసుకున్నట్టు కుటుంబసభ్యులతో చెప్పరు. ఇదే వారు చేసే పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు. బీమా గురించి ఫ్యామిలీకి చెప్పాలంటూ ఐదు కారణాలను వివరించారు. ఆ కారణాలు ఏంటంటే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- లైఫ్‌లో కాంప్రమైజ్ అవ్వన్నంటున్న చైతూ.. 'డెడ్' అంటూ సామ్ పోస్ట్
'థ్యాంక్ యూ' సినిమా టీజర్.. లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని అంటున్నారు యువ హీరో నాగచైతన్య. మరోవైపు సామ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో 'డెడ్' అనే పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- గుజరాత్ టైటాన్స్‌కు ఫుల్ జోష్.. ఐపీఎల్ ఫైనల్‌కు మోదీ, షా!
ఈనెల 29న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఫైనల్ చేరిన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతల రాకతో జట్టులో ఫుల్ జోష్ నిండనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.