- మళ్లీ మారిన "అసని" దిశ.. అంతర్వేదిని వెతుక్కుంటూ తీరం వైపు!
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే.. మళ్లీ దిశ మార్చుకున్న తుపాను.. మరికొన్ని గంటల్లో కోనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత రాత్రికి తిరిగి పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
- ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలి : సీఎం జగన్
రాష్ట్రంలోని రహదారులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల మరమ్మతులకు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లు వేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
- 'గడప గడపకు' నిలదీతలు.. సమస్యలతో జనం స్వాగతం!
'గడప గడపకు మన ప్రభుత్వం' అంటూ వైకాపా నాయకులు చేపట్టిన కార్యక్రమానికి తొలిరోజే సమస్యలు స్వాగతం పలికాయి. ఎక్కడికక్కడ ప్రజలు సమస్యలను ఏకరవుపెట్టారు. పథకాలు తమకు అందడం లేదంటూ ప్రజాప్రతినిధులను నిలదీశారు. రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించలేరా? అంటూ ప్రశ్నించారు.
- ఫోన్ ట్యాపింగ్‌పై.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు షాక్‌కు గురిచేశాయి: లోకేశ్
ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసి, ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కేందుకు స్వేచ్ఛనిచ్చే ఫాసిస్టు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందని తెదేపా నేత నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీమంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్‌గా చెప్పటం షాక్‌కు గురిచేసిందని అన్నారు.
- దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే
దేశద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తైయ్యే వరకు ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
- నరేంద్ర మోదీ ఓ అద్భుతం: వెంకయ్య
మోదీ@20 పుస్తకం విడుదల చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రధాని మోదీ ఓ అద్భుతమని కొనియాడారు. ఈ పుస్తకం ఆధునిక భారత్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరి పరిణామ క్రమాన్ని పాఠకులకు అందిస్తుందని పేర్కొన్నారు.
- శ్రీలంక కొత్త ప్రధాని కోసం చర్చలు.. రంగంలోకి సైన్యం
శ్రీలంక ప్రధాని రాజీనామా చేసినా పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మహింద రాజపక్సను అరెస్టు చేయాలనే డిమాండ్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యం రంగంలోకి దిగి గస్తీ చేపట్టింది. కొత్త ప్రధాని ఎన్నిక కోసం సొంతపార్టీతో పాటు ప్రతిపక్షాలతో అధ్యక్షుడు గొటబయ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
- మార్కెట్లోకి 'టాటా నెక్సాన్ మ్యాక్స్' ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కి.మీ జర్నీ
నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది టాటా. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. అధునాతన ఫీచర్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వాహనం.. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపింది.
- బాలీవుడ్‌పై నేనలా అనలేదే.. మీకలా అర్థమైందా: మహేశ్
బాలీవుడ్‌పై తాను చేసిన కామెంట్స్ గురించి వివరణ ఇచ్చారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. తాను అన్ని భాషలను గౌరవిస్తానని చెప్పారు. అర్థమైందా ?
- IPL 2022: అన్క్యాప్డ్ ప్లేయర్స్.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!
ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా కొంతమంది యువ ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మేరకు 2022 సీజన్లో అద్భుతాలు సృష్టించిన పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు