ETV Bharat / city

సచివాలయం, అసెంబ్లీలో కరోనా కలకలం... 10 మందికి పాజిటివ్ - ఏపీ కరోనా వార్తలు

సచివాలయం, శాసనసభలో మరోసారి కరోనా అలజడి రేగింది. కరోనా నిర్ధరణ పరీక్షల్లో 10 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో వారందరినీ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగులకు సన్నిహితంగా ఉన్న వారందరినీ ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు ఆదేశించారు.

సచివాలయం, అసెంబ్లీలో కరోనా కలకలం... 10 మందికి పాజిటివ్

author img

By

Published : Jul 2, 2020, 2:48 PM IST

రాష్ట్ర సచివాలయం, శాసనసభలో మరోసారి కరోనా కలకలం రేపింది. గత నెల 25వ తేదీన సచివాలయం, అసెంబ్లీలో పని చేసే ఉద్యోగులకు కరోనా పరీక్షలను నిర్వహించగా.. ఫలితాలు ఇవాళ వచ్చాయి. సచివాలయంలో పనిచేస్తున్న మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అసెంబ్లీలో మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. సచివాలయం నాలుగో బ్లాక్ జలవనరుల శాఖలో ముగ్గురు, పశుసంవర్థక శాఖలో ఒకరు, అసెంబ్లీలో ఇద్దరు ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు.

కరోనా బారిన పడిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కొవిడ్​ ఆస్పత్రికి తరలించారు. సచివాలయం, అసెంబ్లీలో కరోనా పాజిటివ్ ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులందరినీ 14 రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఉద్యోగులంతా సచివాలయం నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. సచివాలయం, అసెంబ్లీలలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కి చేరింది. వరుసగా కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సచివాలయం, అసెంబ్లీ.. పరిసరాలు, కార్యాలయాలను శుద్ధి చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.