ETV Bharat / city

సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి: ఎస్ఈసీ - nimmagadda ramesh kumar latest news

ఏపీ ఎస్​ఈసీ
ap sec
author img

By

Published : Jan 11, 2021, 7:20 PM IST

Updated : Jan 12, 2021, 12:54 PM IST

19:18 January 11

డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌ చేసిన ఎస్ఈసీ

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ‘ఇప్పటికే నిర్దేశించిన చట్ట నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులున్నాయి. ఓసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఆ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే పలు తీర్పులున్నాయి. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరూ ప్రశ్నించలేరని.. పూర్తయ్యాక మాత్రమే సవాలు చేయగలరని సుప్రీంకోర్టు 2000లో కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చాక సింగిల్‌ జడ్జి జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది.

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల్ని పరిగణనలోకి తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందని సింగిల్‌ జడ్జి పొరపడ్డారు. కోర్టు ముందు సంబంధిత వివరాలేవీ లేకుండా వ్యాజ్య విచారణ దశలోనే ఆ నిర్ణయానికి రావడం సరికాదు. ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందున్నాయి. కరోనా టీకా వ్యవహారాన్ని కూడా ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టులో సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యాజ్యంలో అభ్యర్థించింది.

కరోనా కేసులు పెరుగుతాయన్న కారణంతో ఎన్నికల్ని నిలువరించాలని కర్ణాటక, కేరళ, రాజస్థాన్‌ హైకోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలైనా న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేదు. వాటన్నింటినీ సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోవాల్సింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టుకు విచారణాధికార పరిధి పరిమితంగా ఉంటుంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని సోమవారం సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి’ అని ఎస్‌ఈసీ అభ్యర్థించింది.

సంబంధిత కథనం:

ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదు: హైకోర్టు

Last Updated : Jan 12, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.