ETV Bharat / city

సోమవారం కొందరికే జీతాలు, పింఛన్లు

ప్రతి నెలా ఒకటో తేదీన రావాల్సిన జీతాలు ఆలస్యమవుతుండగా ఈ సారి పరిస్థితి మారలేదు. సోమవారం కొందరి ఖాతాల్లోనే జీతాలు జమయ్యాయి. ఈ పరిస్థితిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ జీతాలు, పింఛన్లు అందేసరికి మరో వారం రోజులు పట్టవచ్చని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ap salaries
ap salariap salarieses
author img

By

Published : Aug 3, 2021, 7:57 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులలో కొద్దిమందికే సోమవారం జులై నెల జీతాలు, పింఛన్లు జమయ్యాయి. ప్రతినెలా ఒకటో తారీకున రావాల్సిన జీతాలు ఇటీవలి నెలల్లో బాగా ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కూడా ఇటీవల మాట్లాడుతూ జీతాలు సమయానికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ జీతాలు, పింఛన్లు అందేసరికి మరో వారం రోజులు పట్టవచ్చని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చాలామందికి పింఛన్లు అందలేదని పెన్షనర్ల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. ప్రతి నెలా జీతాలు, పింఛన్ల కోసం దాదాపు రూ.5,500 కోట్ల వరకు అవసరమవుతాయి. సోమవారం రూ. 2000 కోట్లలోపు చెల్లించామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండగా... ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం రూ.3500 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నాయి.

సామాజిక పింఛన్లలోనూ ఇబ్బందులు..

సామాజిక పింఛన్ల చెల్లింపుల్లోనూ ఆదివారం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటికి సంబంధించిన కొంత మొత్తం సోమవారం జమ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాఫ్టు పరిస్ధితులను సమన్వయం చేసుకుంటూ చెల్లింపులు సాగిస్తున్నారు. రిజర్వు బ్యాంకులో మంగళవారం నిర్వహించే వేలంలో రాష్ట్రం పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలానికి ఉంచి రూ.2,000 కోట్ల రుణం తీసుకోబోతోంది. అవి బుధవారం సాయంత్రానికి జమయ్యే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కోతను పరిగణనలోకి తీసుకుంటే ఇక మరో వెయ్యి కోట్లు మాత్రమే బహిరంగ మార్కెట్‌ నుంచి రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఈ నెలలోనే ఆ మొత్తమూ తీసుకోనుంది. ప్రస్తుతం వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు ఈనెలలో చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈమేరకు అధికారులు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇదీ చదవండి: EDUCATION: ఫార్మెటివ్‌ రాత పరీక్షకు 70%వెయిటేజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.