రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వాటితో కలిపి ఇప్పటివరకు కరోనా కేసులు 3,377కు చేరాయి. కొత్తగా బయటపడిన వాటిల్లో 19 కేసులకు కోయంబేడు కాంటాక్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వైద్య పరీక్షల కోసం గత 24 గంటల వ్యవధిలో 9,986 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 2,273 మంది డిశ్చార్జి కాగా.. 1033 మంది బాధితులు కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో తాజాగా మరో ముగ్గురు మృతిచెందగా.... రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 71కి చేరింది.
రాష్ట్రంలో మరో 98 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా కేసులు వార్తలు
12:05 June 04