స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఏపీ పోలీసులకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. 9 అవార్డులు సొంతం చేసుకుంది ఏపీ పోలీసు శాఖ. దిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. హాజరైన డీజీపీ గౌతం సవాంగ్... స్కోచ్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వారాంతపు సెలవుల వ్యవస్థ, ఉమెన్ జువైనల్ వింగ్, ఫేస్ ట్రాకర్, ప్రేరణ, స్ఫూర్తి, ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్, పెట్రోలింగ్ సహా పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి.
భవిష్యత్తులో మంచి గుర్తింపు వచ్చేలా పనిచేస్తాం: డీజీపీ
పోలీసు శాఖలో తీసుకొచ్చిన మార్పులు గుర్తింపును తెచ్చాయని డీజీపీ గౌతం సవాంగ్ అభిప్రాయపడ్డారు. 9 స్కోచ్ అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక అవార్డులతో ఏపీ పోలీసులు అగ్రస్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో... సాంకేతికతను ఉపయోగిస్తూ మార్పులు తీసుకురావడం మంచి పరిణామమన్నారు. భవిష్యత్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చేలా పోలీసు శాఖ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : బాలుడు కిడ్నాప్... తండ్రే సూత్రధారి..!