రాష్ట్రంలో రెండో దఫా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్‌ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. రెండో దఫాలో 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఈ నెల 2 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
తొలి రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతోన్న 3,335 పంచాయతీల్లో 7,358 నామినేషన్లు దాఖలయ్యాయి. 33,632 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకు 26,080 నామ పత్రాలు దాఖలయ్యాయి. తొలి దఫాలో రెండు రోజుల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్యతో పోల్చితే రెండో దశలో 1415 నామపత్రాలు తగ్గాయి. వార్డుల్లో మాత్రం తొలిదశతో పోల్చితే రెండో దశ నామినేషన్లు కాస్త పెరిగాయి.
రేపటి నుంచి నామపత్రాల పరిశీలన చేపడతారు. రెండు రోజులపాటు అప్పీలు దాఖలు, పరిష్కారానికి సమయమిస్తారు. ఈ నెల 8 న మధ్యాహ్నం 3 గంటలలోపు నామపత్రాలను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం రెండో దఫాలో పోటీ పడే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేస్తారు.
ఇదీ చదవండి: