ETV Bharat / city

రెండోదశలో ఓటర్ల జోరు.. రాష్ట్రవ్యాప్తంగా 81.61 పోలింగ్ శాతం - ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు

రాష్ట్రంలో శనివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81.61 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ జరిగిన చోట్ల రాత్రి 11.30 గంటల సమయానికి 80 శాతంపైగా పంచాయతీల్లో ఫలితాలు వెలువడ్డాయి. తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు 2,280 చోట్ల గెలుపొందారని వైకాపా, 666 చోట్ల తమ మద్దతుదారులు గెలుపొందారని తెదేపా ప్రకటించుకున్నాయి. రెండో విడతలో 539 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.

ap localbody elections
రెండోదశలో ఓటర్ల జోరు
author img

By

Published : Feb 14, 2021, 8:48 AM IST

పంచాయతీ ఎన్నికల రెండో దశలోనూ ప్రజలు అదే జోరును చూపించారు. మొదటిదశలోకంటే రెండో దశలోనే పోలిగద్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 81.61% పోలింగ్‌ నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో గరిష్ఠంగా 86.60%,శ్రీకాకుళంలో కనిష్ఠంగా 72.87% ఓట్లు పోలయ్యాయి.

రెండో విడతలో మొత్తం 3,325 పంచాయతీలకు గానూ ఏకగ్రీవం మినహా మిగతా 2,786 పంచాయతీలకు, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు శనివారం పోలింగ్‌ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు 2,280 చోట్ల గెలుపొందారని, తెదేపా మద్దతిచ్చిన అభ్యర్థులు 420 స్థానాల్లో గెలిచారని రాత్రి 11.30 గంటల సమయంలో వైకాపా ప్రకటించింది. జగన్‌ సంక్షేమ పాలనకు ఈ విజయం నిదర్శనమని వ్యాఖ్యానించింది. తెదేపా కూడా రాత్రి 11.45 గంటల సమయానికి ఒక జాబితా విడుదల చేసింది. శనివారం పోలింగ్‌ జరిగిన.. 2,786 స్థానాల్లో తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు 666 చోట్ల గెలిచినట్టు తెదేపా ప్రకటించింది. వైకాపా అభ్యర్థులు 997 స్థానాల్లో గెలిచినట్టుగా పేర్కొంది. మంత్రి కొడాలి నాని సహా పలువురు వైకాపా కీలక నేతల నియోజకవర్గాల్లో తెదేపా మద్దతుదారులే గెలిచారని, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే రుజువని పేర్కొంది.

ap localbody elections
రెండోదశలో ఓటర్ల జోరు

ఆగుతూ.. సాగుతూ

ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల పలు కారణాలతో పోలింగుకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. కలెక్టర్లు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవడంతో మళ్లీ ముందుకు సాగింది.

  • ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడు పంచాయతీలో నాలుగో వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు బ్యాలెట్‌ పత్రాల్లో మారడంతో పోలింగు తాత్కాలికంగా నిలిచిపోయింది. రిజర్వులో ఉంచిన బ్యాలెట్‌ పత్రాలతో తరువాత పోలింగును పునరుద్ధరించారు. ఇదే జిల్లాలోని సంతమాగులూరు మండలం ఏల్చూరు పంచాయతీలో 14వ వార్డుకు సంబంధించి ఏజెంట్ల దగ్గర ఓటర్ల జాబితా, పోలింగు సిబ్బంది వద్ద ఓటర్ల జాబితా మధ్య తేడా ఉండటంతో పోలింగ్‌ నిలిచిపోయింది. లోపాన్ని సరిచేసి ఎన్నిక నిర్వహించారు.
  • గుంటూరు జిల్లా నకిరేకల్‌ మండలం నరసింగపాడు పంచాయతీలో రెండో వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక గుర్తుకు బదులుగా మరో గుర్తుపై ప్రచారం చేశారు. పోలింగు సమయంలో బ్యాలెట్‌ పత్రంలో వారికి కేటాయించిన సంఖ్యకు ఎదురుగా వేరొక గుర్తు కనిపించడంతో గందరగోళానికి గురయ్యారు. దీంతో పోలింగుకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈపూరు మండలం ఇనమెళ్ల పంచాయతీలో తెదేపా మద్దతుదారులను వైకాపా మద్దతుదారులు పోలింగు కేంద్రంలోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు.
  • వినుకొండ మండలం నడిగడ్డ పంచాయతీకి సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలు దొంగతనం కావడంతో ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వులో ఉంచిన బ్యాలెట్‌పత్రాలతో ఎన్నిక నిర్వహించారు.
  • విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం క్రిష్టపల్లి పోలింగు కేంద్రంలోకి మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు వెళ్లడాన్ని ఎన్నికల అధికారులు, సిబ్బంది అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

లెక్కింపు వీడియో రికార్డ్‌ చేయాల్సిందే: ఎస్‌ఈసీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విజయవాడలోని ఎన్నికల సంఘ కార్యాలయంలో వెబ్‌ కాస్టింగు విధానంలో పోలింగు తీరును సమీక్షించారు. రెండో దశ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య చేపట్టాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. తొలి దశ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఓట్ల లెక్కింపును రికార్డ్‌ చేయించాలని ఆయన సూచించారు. సీసీ కెమెరాలు అందుబాటులో లేని చోట వీడియో కెమెరాలతో చిత్రీకరించాలన్నారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో పోలింగు జరుగుతున్న తీరును తాడేపల్లిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ వెబ్‌ కాస్టింగులో పరిశీలించారు.

అవాంఛనీయ ఘటనలేవీ జరగలేదు: డీజీపీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికల కంటే రెండో విడతలో ఎక్కువ పోలింగ్‌ శాతం నమోదైనప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అల్లర్లు తక్కువ జరిగాయన్నారు. ఎన్నికల నిర్వహణలో సమర్థంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

ఇదీ చూడండి: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.