రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పీఆర్సీపై ఓ నిర్ణయం తీసుకునేలా తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు(ap ngos association leaders demand for PRC news). 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా నియమితులైన చంద్రశేఖర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఇది ఎన్జీఓ సంఘానికి దక్కిన ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
జాయింట్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన మీదట ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటో తేదీన ఉద్యోగాలు, ఫించనుదారులకు ఈనెల జీతాలు చెల్లిస్తోందన్నారు. ఆర్థికపరమైన డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణతో పొల్చితే ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు రాజకీయ పదవులు తక్కువే వచ్చాయన్నారు. వైద్య ఉద్యోగులకు యాప్‌ల భారం తగ్గించాలని.. టీకాలు, కొవిడ్ తనిఖీలు ఒకేచోట చేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎన్జీఓ సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు.
పరిష్కారానికి కృషి చేస్తా: చంద్రశేఖర్ రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా తాను బాధ్యతలు స్వీకరించానని పేర్కొన్న చంద్రశేఖర్ రెడ్డి... ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని సంఘాల సమన్వయంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి
సీఎం దీపావళి కానుక- విద్యుత్ ఛార్జీ యూనిట్‌కు రూ.3 తగ్గింపు