ETV Bharat / city

పులిచింతలను సందర్శించిన మంత్రులు - పులిచింతల ప్రాజెక్టు తాజా వార్తలు

తెలంగాణలోని వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని సందర్శించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద నీరు కొనసాగడం వల్ల మంత్రులు ప్రాజెక్ట్‌ను పరిశీలించారు.

ap-ministers
ap-ministers
author img

By

Published : Aug 29, 2020, 7:33 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ విప్ ఉదయ బాను, వాసిరెడ్డి పద్మ తదితరులు సందర్శించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద నీరు కొనసాగడం వల్ల మంత్రులు ప్రాజెక్ట్‌ను పరిశీలించారు.

పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 174 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.98 టీఎంసీల మేర నీరు ఉంది. విద్యుత్ ఉత్పాదన ద్వారా పది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 21925 క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతోంది.

ఇదీ చూడండి: '

లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.