ETV Bharat / city

15వ ఆర్థికసంఘం సిఫార్సులతో రాష్ట్రానికి నష్టం.. ఎలాగంటే? - ap loss in central budget news

రాష్ట్రానికి 15వ ఆర్థికసంఘం సిఫార్సులు దెబ్బతీశాయి. రాష్ట్రాల వాటా లెక్కించడానికి కొత్త కొలమానాలు తీసుకున్న కారణంగా...ఏపీ వాటా తగ్గిపోయింది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15 వందల కోట్లకు పైగా రాష్ట్రం నష్టపోనుంది.

ap loss in central budget
ap loss in central budget
author img

By

Published : Feb 2, 2020, 5:40 AM IST

Updated : Feb 2, 2020, 6:29 AM IST

15 వ ఆర్థికసంఘం సిఫార్సులు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాయి. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.30 శాతం నుంచి 4.11 శాతానికి తగ్గించడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం దాదాపు 15వందల కోట్లకు పైగా నష్టపోనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి 28, 242 కోట్లు రాగా...2020-21కి 32వేల 237 కోట్లకు పెరగనుంది. గతేడాదితో పోలిస్తే నికరంగా 4వేల కోట్లకు పైగా పెరిగింది. కానీ రాష్ట్రాల వాటాలను లెక్కించడానికి 15 వ ఆర్థికసంఘం తీసుకున్న కొలమానాల కారణంగా ఏపీకి 15 వందల 21 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.

రెవెన్యూలోటు కింద రాష్ట్రానికి ఈ ఆర్థిక ఏడాది 5వేల 897 కోట్లు ఇవ్వాల్సిందింగా 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. రాష్ట్రానికి ఈ ఏడాది 41వేల 54 కోట్ల రూపాయల రెవెన్యూలోటు ఏర్పడుతుందని అంచనా వేయగా....కేంద్ర పన్నుల్లో వాటా కింద 35వేల 156 కోట్లు పోను మిగిలిన 5వేల 897 కోట్లు లోటు ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 14వ ఆర్థికసంఘం సిఫార్సు మేరకు గత ఐదేళ్లలో రెవెన్యూలోటు కింద 22వేల 133 కోట్లు అందాయి. 2019-20 నాటికి రెవెన్యూలోటు 2వేల 499 కోట్లకే పరిమితమవుతుందని ఆ సంఘం అంచనా వేసింది. 2020-21 నాటికి మరింత తగ్గాల్సి ఉన్నా....ఏకంగా 5వేల 897 కోట్లకు చేరడం విశేషం. 14, 15 ఆర్థిక సంఘాల అంచనాల్లో గందరగోళం చూస్తుంటే...గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థలకు రూ.4వేల కోట్ల నిధులు
* రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర బడ్జెట్‌లో రూ.2,625 కోట్లు కేటాయించారు.
* పది లక్షల్లోపు జనాభా ఉన్న నగరాలకు రూ.994 కోట్లు, అంతకుమించి జనాభా ఉన్న నగరాలకు రూ.270 కోట్లు కలిపి పట్టణ స్థానిక సంస్థలకు మొత్తం రూ.1,264 కోట్లు కేటాయింపు
* విజయవాడకు రూ.124 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.62 కోట్లు గాలి నాణ్యత మెరుగుదలకు, మరో రూ.62 కోట్లు ఘన వ్యర్థాల నిర్వహణకు ఇచ్చారు.
* విశాఖపట్నానికి రూ.146 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని గాలినాణ్యత, ఘన వ్యర్థాల నిర్వహణకు చెరిసగం ఖర్చు చేస్తారు.
* రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి కింద ఏపీకి రూ.1,491 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్రం వాటా రూ.1,119 కోట్లు. రాష్ట్రం రూ.372 కోట్లు సమకూర్చుకోవాలి.
* పోషకాహార నిధుల కింద రూ.263 కోట్లు రానున్నాయి.

ఇదీ చదవండి: బడ్జెట్​ 2020: నిర్మల పద్దులోని హైలైట్స్​

15వ ఆర్థికసంఘం సిఫార్సులతో రాష్ట్రానికి నష్టం

Last Updated : Feb 2, 2020, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.