2018లో ప్రారంభమైన ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో ఎంత మేరకు పరిస్థితుల్లో మార్పు వచ్చిందో తెలుసుకోవడానికి ఇటీవల నీతి ఆయోగ్ అధ్యయనం చేశారు.. ఈ కార్యక్రమంలో చేరక ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికి ఛత్తీస్‌గఢ్ 80%, ఒడిశా 70%, ఆంధ్రప్రదేశ్ 66.67%, ఝార్ఖండ్ 63% పురోగతి సాధించి తొలి నాలుగు స్థానాల్లో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. ఆరోగ్యం, పోషకాహార విభాగంలో నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్‌లోని కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు దాదాపుగా చేరుకున్నాయి.
ఇదీ చదవండి : 'మలయాళ సినిమా మరోసారి సత్తా చాటింది'