తిరుమలలోని హథీరాంజీ మఠం మహంత్ పదవి నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ అర్జున్ దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఏకపక్షంగా విధుల నుంచి తొలగించటం దారుణమంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సంజాయిషీ నోటీసూ ఇవ్వలేదన్నారు. మహంత్‌ను తొలగించే అధికారం ధార్మిక పరిషత్‌కు ఉందని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదప్రతివాదనల తరువాత... నిబంధనలకు విరుద్ధంగా విధుల నుంచి తొలగించారని హైకోర్టు అభిప్రాయపడింది. ధార్మిక పరిషత్‌కు సంబంధించి తగిన కోరం లేకుండానే నిర్ణయం తీసుకున్నారంది. సస్పెండ్ ఉత్తర్వుల అమలును మూడు వారాలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. రెవెన్యూ ఎండోమెంట్ శాఖ ముఖ్యకార్యదర్శి, ధార్మిక పరిషత్ సభ్యకార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్ సహా పలువురికి నోటీసులు జారీ చేశారు.
హథీరాంజీ మఠం వివాదంపై ప్రమాణపత్రం దాఖలు చేయండి: హైకోర్టు
హథీరాంజీ మఠం మహంత్ పదవి నుంచి అర్జున్ దాస్‌ను సస్పెండ్ చేస్తూ జారీ అయిన ఉత్తర్వుల అమలును 3 వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది.