ETV Bharat / city

ఈ నెల 27 వరకు యథాతథం.. ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు - మూడు రాజధానులపై హైకోర్టు స్టేటస్ కో న్యూస్

అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై విధించిన యథాతథ స్థితిని... హైకోర్టు ఈనెల 27 వరకూ పొడిగించింది. ప్రభుత్వ అభ్యర్థనను... త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. 'స్టేటస్-కో'పై స్పష్టత ఇవ్వాలన్న వాదనపై స్పందించిన ధర్మాసనం.... అవసరం లేదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను కూడా ఈనెల 27కు వాయిదా వేసింది.

ఈ నెల 27 వరకు యథాతథం.. ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

author img

By

Published : Aug 15, 2020, 4:24 AM IST

రాజధాని అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై.... ఈనెల 4న ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులను పొడిగించొద్దంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను.... హైకోర్టు తోసిపుచ్చింది. రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం..ఈ నెల 27 వరకూ స్టేటస్-కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఈనెల 4న విచారణ జరిపిన ధర్మాసనం.. కార్యాలయాల తరలింపు విషయంలో ఈ నెల 14 వరకు యథాతథ స్థితి పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను ఈ నెల 27 వరకూ పొడిగిస్తూ శుక్రవారం మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 4న ఇచ్చిన స్టేటస్‌-కో ఉత్తర్వులను పొడిగించొద్దని.. వాటి వల్ల ఏమీ చేయడానికి వీల్లేకుండా పోయిందని.. ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. ప్రభుత్వం భావించిన చోట సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తరలింపుపై స్టేటస్-కో జారీ చేసి... ఇతర కార్యక్రమాలు కొనసాగించేందుకు అనుమతివ్వాలని కోరారు. రాజధానిని తరలించడం లేదని వివరించారు. అందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. కార్యాలయాలు ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రభుత్వ విధులపై.... మధ్యంతర ఉత్తర్వులు ప్రభావం చూపుతాయన్నారు. స్టేటస్-కోపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చడమే గాక.... స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలా లేదా అనే అంశంపై విచారణ జరపాలని... అడ్వకేట్ జనరల్ ఎస్​.శ్రీరామ్ కోరారు. ప్రస్తుతం ఉన్న స్టేటస్-కో ఉత్తర్వుల వల్ల ఎవరికీ ఉపయోగం లేదని వాదించారు. అన్ని పనులూ నిలిచిపోయాయన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తదుపరి విచారణ నాటి నుంచి.... రోజువారీగా విచారణ జరపాలని... సీఆర్డీఏ తరఫు న్యాయవాది కోరారు.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని.... పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించారు. కొత్త చట్టాల అమలును నిలుపుదల చేయాలని కోరారు. విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు.... ఈ చట్టాలు విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. విభజన చట్టంలో ఒక రాజధాని గురించి మాత్రమే ప్రస్తావించారని చెప్పారు.

అందరి వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.... స్టేటస్-కో ఉత్తర్వులు ఈనెల 27 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది. విచారణను కూడా అదే రోజుకూ వాయిదాకు వేసింది.

ఇదీ చదవండి: అమరావతిపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.