రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటం కష్టసాధ్యమని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు సైతం జరుగుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయం తెలపాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది.
ఏపిలో స్థానిక ఎన్నికలు జరపాలని కోరుతూ 2019 సెప్టెంబర్లో తాండవ యోగేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఇదీ చదవండి: సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా