నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన అరెస్ట్‌పై మరో మూడు వారాల పాటు తొందరపడవద్దని పోలీసులను ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు అరెస్ట్‌పై రెండు వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గత విచారణలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు మూడు వారాల పాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది .
ఇదీ చదవండి