ETV Bharat / city

రాజధాని రైతులకు కౌలు ఎప్పుడు చెల్లిస్తారు ?.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న - అమరావతి రైతలు తాజా వార్తలు

రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం.. కౌలు చెల్లింపు విషయమై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాజధాని రైతులుకు కౌలు ఎప్పుడు చెల్లిస్తారు ?

author img

By

Published : Jun 15, 2022, 9:47 PM IST

రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి ఏడాది రైతులకు కౌలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు కౌలు మినహా వేరే ఆదాయం లేదని చెప్పారు. వ్యవసాయం మినహా వేరే వృత్తి రాకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి ఏడాది మే 1 నాటికి కౌలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పిటిషనర్ వాదనలు పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం.. రైతులకు కౌలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి సమాచారం ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.