ETV Bharat / city

నేర ఘటనకు ముందున్న ఆస్తులను ఈడీ జప్తు చేయడానికి వీల్లేదు: హైకోర్టు - ap high orders to ED on the forfeiture of assets latest news

నేర ఘటనకు ముందున్న ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. విచారణ సందర్భంగా పలు సందర్భాల్లో వివిధ న్యాయస్థానాలను ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోండి. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

ఏపీ హైకోర్టు
ap high court
author img

By

Published : Mar 30, 2021, 4:05 AM IST

నేర ఘటనకు ముందున్న ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆరోపిత నేరం ద్వారా పొందిన సొమ్ముతో సంపాదించిన ఆస్తులను జప్తు చేసి వాటిపై తదుపరి చర్యలను కొనసాగించుకోవచ్చని చెప్పింది. ఐడీబీఐ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కుమార్ వప్పు సింగ్ అనే వ్యక్తితో పాటు ఇతరులపై 2018 మార్చి 27న సీబీఐ కేసు నమోదు చేసింది.

2009-12 మధ్య కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణ దస్త్రాలు లేకుండా 101 మందికి 74.99 కోట్ల రుణం మంజూరు చేసి , విడుదల చేసినట్లు బ్యాంక్‌ ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా కుమార్ పప్పు సింగ్ తదితరులకు చెందిన వివిధ ఆస్తులను ప్రాథమిక జప్తు చేస్తూ 2019 డిసెంబర్ లో ఈడీ విశాఖ సబ్ జోనల్ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారు. అథారిటీ జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ వప్పు సింగ్ తదితరులు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పలు సందర్భాల్లో వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకున్నారు. నేర ఘటనకు ముందు కొనుగోలు చేసిన ఆస్తులు ప్రాసిడ్స్ ఆఫ్ క్రైమ్ అనే నిర్వచనం కిందకు రాదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వాటిని జప్తు చేయడానికి వీల్లేదన్నారు.

ఇదీ చదవండి

సత్తెనపల్లిలో నాటుతుపాకీ కలకలం... పోలీసుల దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.