HIGH COURT: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలపై వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేసిన వారిని.. ఆ తర్వాత మున్సిపాలిటీల్లో చేర్చారంటూ వేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారించింది.
ఎన్నికల సమయంలో పార్టీలకు ఓటర్ల జాబితా ఇవ్వలేదని, వార్డు రిజర్వేషన్లు కూడా హేతుబద్ధంగా లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తోడు.. పరిషత్ ఎన్నికల్లో ఓటేసిన వారిని మున్సిపాలిటీలో చేర్చినట్లు కోర్టుకు వివరించారు.
పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. వారం రోజుల్లోగా ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది. రెండు వారాల్లోగా ఆర్‌డీవో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: NEERUKONDA ON AMRAVATI CORPORATION : అమరావతి కార్పొరేషన్లో కలవబోమన్న నీరుకొండ వాసులు