ETV Bharat / city

ఆస్పత్రుల్లో బెడ్లు, కొవిడ్‌ చికిత్స వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి: హైకోర్టు - ఏపీలో ఆస్పత్రుల్లో బెడ్లు, కొవిడ్‌ చికిత్స వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి

ఆస్పత్రుల్లో బెడ్లు, కొవిడ్‌ చికిత్స వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం, ఆక్సిజన్ బెడ్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించించిన న్యాయస్థానం..ఈనెల 19న వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆస్పత్రుల్లో బెడ్లు, కొవిడ్‌ చికిత్స వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి

author img

By

Published : May 17, 2021, 3:39 PM IST

కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం, ఆక్సిజన్ బెడ్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై అఖిల భారత న్యాయవాదుల సంఘం, ఏపీసీఎల్‌ఏ, తోట సురేశ్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అందరికీ వ్యాక్సినేషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు తెలుసుకున్న న్యాయస్థానం.. రెమ్‌డెసివిర్‌తో పాటు అత్యవసర మందుల లభ్యతపై ఆరా తీసింది.

సీనియర్ సిటిజన్స్, కొవిడ్ రోగులకు ఇళ్ల వద్ద వ్యాక్సిన్‌పై ప్రశ్నించిన జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలిత్ కుమారిలతో కూడిన ధర్మాసనం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నారో ఈనెల 19న కోర్టుకు తెలిపాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, కొవిడ్‌ చికిత్స వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో రోగుల రోజువారీ సమాచారం బాధిత కుటుంబసభ్యులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదీచదవండి: ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.