ETV Bharat / city

APSRTC: ప్రైవేటు వైపు వడివడిగా.. ఏపీఎస్‌ఆర్టీసీ అడుగులు !

APSRTC: ఆర్టీసీ ప్రైవేటు వైపు వేగంగా కదులుతోంది. అద్దె బస్సుల సంఖ్యను పెంచుతూ ఖాళీగా ఉన్న 2వేల డ్రైవర్ల పోస్టుల భర్తీ ప్రక్రియకు మంగళం పాడింది. కొత్తగా 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచింది. ఇప్పటికే 25 శాతం ఉన్న అద్దె బస్సులను 35 శాతానికి పెంచింది.

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు అడుగులు
privatization of apsrtc
author img

By

Published : May 4, 2022, 5:29 AM IST

Updated : May 4, 2022, 5:47 AM IST

ప్రైవేటు వైపు వడివడిగా.. ఏపీఎస్‌ఆర్టీసీ అడుగులు !

APSRTC: ఏపీఎస్​ఆర్టీసీ ప్రైవేటు వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తున్న తరుణంలో సొంత బస్సుల సంఖ్యను మరింత పెంచి ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సి ఉన్నా.. అద్దె బస్సుల సంఖ్యను పెంచేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా మారడంతో ఖాళీలను ప్రభుత్వమే భర్తీ చేయాలి. అద్దె బస్సులు తీసుకుంటే నియామకాలు అవసరం ఉండవు. ఒకేసారి 998 అద్దె బస్సులను టెండర్లు పిలవడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఆర్టీసీలో 11,236 బస్సులు ఉన్నాయి. వీటిలో సొంత బస్సులు 8 వేల 972 కాగా.. అద్దెవి 2 వేల 264. మొత్తం బస్సుల్లో 3 వేలు కాలం చెల్లిపోయాయి. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. అయితే యాజమాన్యం అద్దె బస్సుల బాట పడుతోంది. ఎన్ని బస్సులు అవసరమనే వివరాలను ఉన్నతాధికారులు జిల్లాల నుంచి ఇటీవల తెప్పించుకున్నారు. దాదాపు 16 వందల 33 బస్సులు అవసరమని నివేదిక వచ్చింది. వీటిలో 998 బస్సులను అద్దెకు తీసుకోవడానికి ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ నెల 5 వరకు టెండర్ల దాఖలుకు గడువుంది. 10, 11 తేదీల్లో రివర్స్ వేలం నిర్వహించి.. వాటికి కిలోమీటరుకు చెల్లించే ధరలను ఖరారు చేస్తారు. ఈ అద్దె బస్సులకు తోడు.. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి ఆర్డర్‌ ఇచ్చిన 100 విద్యుత్ ఏసీ అద్దె బస్సులూ త్వరలో రానున్నాయి. అద్దె బస్సుల్లో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు కలిపి 617 బస్సులు ఉన్నాయి.

ఆర్టీసీలో 25 శాతం మాత్రమే అద్దె బస్సులు తీసుకోవాలని.. మిగిలినవి సొంతవే ఉండాలనే నిబంధన ఉండేది. కొంతకాలం క్రితం పాలకవర్గ సమావేశంలో.... అద్దె బస్సుల వాటాను 35 శాతానికి పెంచుతూ తీర్మానించి దాన్ని బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు 998 అద్దె బస్సులు ఎలా తీసుకుంటున్నారని ఆరా తీయగా.. తీర్మానం విషయం బయటకువచ్చింది. 2020 మార్చిలో 250 బస్సులు కొన్నారు. తర్వాత కొత్త బస్సులపై దృష్టి పెట్టలేదు. BS-6 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ సొంత బస్సులు తీసుకోలేదు.

ఆర్టీసీలో కొంతకాలంగా ఖాళీ పోస్టుల భర్తీ జరగట్లేదు. 2వేల డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి డిపో పరిధిలో ఆన్‌కాల్‌ డ్రైవర్లను అందుబాటులో ఉంచుకున్నారు. అంటే డ్రైవర్ల కొరత ఉన్నపుడు ప్రైవేటు డ్రైవర్లకు రోజువారీగా విధులు కేటాయిస్తున్నారు. ఇందుకు వారికి రోజుకు 800 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక్కో బస్సుకు సగటున 2.6 మంది డ్రైవర్లు అవసరం. కనీసం ఇద్దరైనా ఉండాలి. కొత్తగా తీసుకునే 998 అద్దె బస్సుల్లో డ్రైవర్లు బయటివారే ఉంటారు. అంటే దాదాపు 2వేల మంది ప్రైవేటు డ్రైవర్లు రానున్నారు. దీనివల్ల ఆర్టీసీలో 2వేల డ్రైవర్ల పోస్టుల భర్తీ ఉండదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌- టీఎఫ్​ఎల్​ విధానం ఉండగా.. దీన్ని మన రాష్ట్రంలో అమలుచేయాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. టీఎఫ్​ఎల్​లో దాదాపు అన్నీ ప్రైవేటు బస్సులే ఉంటాయి. రూట్ల వారీగా ప్రైవేటు బస్సులకు అవకాశం కల్పించి, ప్రజారవాణా అందుబాటులో ఉంచుతారనేది... వాటిలో ఛార్జీలు.. ఎప్పుడు, ఎక్కడ తిరగాలనేది టీఎఫ్​ఎల్​ అథారిటీ నిర్ణయిస్తుంది. వేల బస్సులను 200 నుంచి 300 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తుంటారు. ఈ విధానం ఇక్కడ అమలు చేయాలంటే రెగ్యులర్‌ సిబ్బందిని క్రమంగా తగ్గించి, సొంత బస్సులకు బదులు అద్దె బస్సులు పెంచుకుంటూ పోతారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: పెనుగాలుల విధ్వంసం.. ప్రమాదపు అంచుల్లోకి దక్షిణ విద్యుత్​ గ్రిడ్​

Last Updated : May 4, 2022, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.