పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించడం సాధ్యం కాదంటూ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఎస్‌ఈసీ ప్రకటనపై హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటన చేశారని ప్రభుత్వం పేర్కొంది. కరోనా వేళ ప్రజారోగ్యం చాలా ముఖ్యమని.. ఇప్పటికే 6 వేల మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు నిర్వహిస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ప్రభుత్వం కోరింది.
ఇదీ చదవండి: గ్రేటర్ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!