రాష్ట్రవ్యాప్తంగా వాసవి కన్యాకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది(ap govt notification on arya vysya choultries news). ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, చౌల్ట్రీలను ఏపీ ధార్మిక హిందూ సంస్థలు, దేవాదాయ చట్టం నుంచి మినహాయిస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీ మోహన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక నుంచి ఆర్యవైశ్య సంఘాల పరిధిలోనే ఇవి పని చేస్తాయని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
పాలనాపరమైన అంశాల్లో అవకతవకలు ఉన్నట్టుగా వెల్లడైతే తక్షణం ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేస్తుందని షరతు విధించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా ఆర్యవైశ్య సంఘాలు సీఎం జగన్ ను కలిసి దీనిపై విజ్ఞాపన పత్రం ఇవ్వటంతో ప్రభుత్వం .. అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి