ETV Bharat / city

కోర్టుల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు అధికారుల నియామకం - కోర్టుల్లో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అధికారులు నియామకం

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ లు వేసేందుకు ప్రభుత్వం అధికారులను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు బాధ్యతలను పురపాలకశాఖ కార్యదర్శికి అప్పగించింది.

ఆ చట్టాలపై కోర్టుల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు అధికారులు నియామకం

author img

By

Published : Aug 11, 2020, 3:21 PM IST

Updated : Aug 11, 2020, 4:49 PM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్​లు వేసేందుకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ అఫిడవిట్ల దాఖలు బాధ్యతలు పురపాలకశాఖ కార్యదర్శి శ్యామలరావుకి అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పిటిషన్లలలో వివిధ ప్రభుత్వ విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తున్న కారణంగా కౌంటర్ అఫిడవిట్​ల దాఖలు కోసం శ్యామలరావును నామినేట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మిగిలిన అధికారుల బదులుగా కౌంటర్ అఫిడవిట్​లో శ్యామలరావును అధీకృత అధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్యామలరావు అందుబాటులో లేని పక్షంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ్ మనోహర్ రావు ఆ బాధ్యతలు తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:

సాగునీటి వినియోగంపై కేసీఆర్‌ వైఖరి సరైంది కాదు: రామకృష్ణ

Last Updated : Aug 11, 2020, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.