జగనన్న శాశ్వత భూ హక్కు (YSR Jagananna Shaswata Bhoo Hakku), భూ రక్షా పథకం (Bhu Raksha Scheme) అమలులో వివాదాల పరిష్కారం కోసం నియమించిన డిప్యూటీ తహసీల్దార్ల(deputy tahsildar)కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (special executive magistrate) అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో మండల వారీగా నియమించిన మొబైల్ బృందాల్లోని డిప్యూటీ తహసీల్దార్లకు ఈ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించారు.
భూముల రీ సర్వే ప్రక్రియలో అప్పటికప్పుడు తలెత్తిన భూ వివాదాల పరిష్కారానికి డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో ప్రభుత్వం మొబైల్ బృందాలను నియమించింది. భూముల రీసర్వేలో భాగంగా స్థానికంగా తలెత్తే వివాదాలు ఇరు వర్గాల సమక్షంలో అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ఈ మొబైల్ బృందాలు కార్యాచరణ చేపట్టనున్నాయి. రెవెన్యూ చట్టం ప్రకారం ఇప్పటి వరకు తహసీల్దార్లకు మాత్రమే మేజిస్ట్రిరియల్ అధికారాలు ఉన్నాయి. ప్రస్తుతం భూ సర్వే ప్రక్రియ కోసం డిప్యూటీ తహసీల్దార్ లకు కూడా ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను ప్రభుత్వం కల్పించింది.
ఇదీ చదవండి:
ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ రెసిడెంట్ వైద్యులు