కరోనా నేపథ్యంలో తగిన రక్షణ చర్యలు, జాగ్రత్తలు పాటిస్తూ మత్స్య, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచిస్తూ ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. హేచరీలు, ఫీడ్ ప్లాంటులు, పాల సేకరణ, రవాణా, సరఫరా, పౌల్ట్రీఫారాలు, గోశాలలు తదితర చోట్ల కార్యకలాపాలు నిర్వహించేవారు ఈ మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది. సముద్రం, చెరువుల్లో చేపలు పట్టేటప్పుడు, రవాణా చేసేటప్పుడు, పాలను సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ప్రామాణిక నిర్వహణ పద్ధతులు జారీ చేసింది. వీటి ప్రకారం పాల సేకరణ కేంద్రాల వద్ద ఉమ్మివేయకూడదు.
గట్టిగా అరవకూడదు. డెయిరీ ఫామ్స్‌లో పశువులకు ఆహారం పెట్టేటప్పుడు, పాలు తీసేటప్పుడు ముందు, తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలి. చికెన్, మటన్ ప్యాకింగ్‌కు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: