స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొవిడ్ వారియర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవించింది. రాష్ట్రస్థాయితో పాటు జిల్లాలు, మండల వారీగా వారికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపి స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగస్వాముల్ని చేసింది. ఉన్నతాధితాకారులు వారికి ప్రత్యేకంగా ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, 108, 104 సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, పోలీసులు వంటి విభాగాలకు చెందిన వారిని ఆహ్వానించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రసంగించే వేదికకు కుడివైపు స్థానాలను కేటాయించింది.
వేడుకల అనంతరం కొవిడ్ వారియర్లకు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియచేశారు. వారితో మాట్లాడి సెల్ఫీలు దిగారు. మరోవైపు వేడుకల్లో భాగంగా కొవిడ్ వారియర్లతో కూడిన ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించారు.
ఇదీ చదవండి:
భారీ వర్షం.. వరద ప్రవాహం... పంట నష్టం... ఇదీ ప్రస్తుత చిత్రం