ETV Bharat / city

పదోతరగతి ప్రశ్నపత్రంలో కీలక మార్పులు - పదో తరగతి

పదో తరగతి ప్రశ్నపత్రంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి బిట్ పేపర్‌ను తొలగించాలని నిర్ణయించింది. ప్రశ్నపత్రంలోనే బిట్​ పేపర్​ను ఉంచి విద్యార్థి  జ్ఞానాన్ని పరీక్షించాలని భావిస్తోంది. 15 నిమిషాల సమయం అదనంగా ఇవ్వాలని యోచిస్తోంది.

ap_govt_decision_about_10 th_class_exam
author img

By

Published : Sep 27, 2019, 5:37 AM IST

విద్యారంగంలో భారీ సంస్కరణలు తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచే పదో తరగతి ప్రశ్నపత్రంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే బిట్ పేపర్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రశ్నపత్రంలో 20 శాతం మేర ఇంటర్నల్ అసెస్మెంట్‌గా ఉండే బిట్ పేపర్‌ను తొలగిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. బిట్ పేపరు కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రశ్నపత్రంలోనే ఇది భాగమై ఉంటుందని ప్రకటించారు. చూచిరాతలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఇకపై 18 పేజీల బుక్​లెట్​

మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. పేపర్‌ -1లో 50 మార్కులు, పేపర్‌ -2లో 50 మార్కులకు పరీక్ష జరుగనుంది. వ్యాసరూప, సంక్షిప్త, క్లుప్త, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ప్రశ్నపత్రంలో ఉండనున్నాయి. ఒక్కో సబ్జెక్టులోనూ 2 పేపర్‌ లను కలిపి ఉత్తీర్ణత మార్కులను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. 18 పేజీల బుక్ లెట్‌లను ఇవ్వనున్నట్లు... సమాధానాలన్నీ ఇందులోనే పొందుపర్చాలని తెలిపారు. మూల్యాంకనాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్కుల జాబితాలను నాణ్యమైన కాగితంపై ముద్రించనున్నట్లు మంత్రి వివరించారు.

పదోతరగతి ప్రశ్నపత్రంలో కీలక మార్పులు

ఇదీ చదవండి: పదో తరగతి ప్రశ్నపత్రంలో బిట్ పేపర్ తొలిగింపు: మంత్రి సురేశ్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.