ETV Bharat / city

'ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యంగం మనది' - రాజ్యంగ దినోత్సవంపై ఏపీ గవర్నర్ వ్యాఖ్య

'రాజ్యాంగ దినోత్సవం' సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని నిలబెట్టే క్రమంలో దేశ ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు.

ap governor bishwabhushan on constitution day

author img

By

Published : Nov 26, 2020, 10:18 AM IST

ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగం భారతదేశానిదని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 'రాజ్యాంగ దినోత్సవం' సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు దేశంలోని ప్రతి పౌరుడికి చట్టం ముందు సమానత్వం, సమానమైన రక్షణ కల్పించాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుందని గవర్నర్ అన్నారు.

రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, మాట్లాడే స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని బిశ్వ భూషణ్​ అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశేష కృషి చేశారని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:

తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.