ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐబీఎం సహా వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ, ఫిల్మ్, ఆహారశుద్ధి, పర్యాటక రంగాల్లో ఆయా సంస్థలతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందాలు చేసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐబీఎం ఇండియాతో... ఫిల్మ్, టీవీ రంగంలో ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పర్యాటక రంగంలో ఐటీడీసీ, ఆహార శుద్ధి రంగంలో సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గురువారం వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో సహకారం అందించేందుకు ఈ సంస్థలు అంగీకరించినట్టు మంత్రి వెల్లడించారు. వర్చువల్ విధానంలో ఈ సంస్థలతో ఏపీ స్కిల్ డెవలప్మె కార్పోరేషన్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి