AP-RBI News: రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపింది. 20 ఏళ్ల కాలపరిమితికి రూ.వెయ్యి కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితికి మరో రూ.వెయ్యి కోట్లు రుణం కావాలని ప్రతిపాదించింది. మంగళవారం సెక్యూరిటీల వేలంలో ఎంత వడ్డీకి ఈ రుణం దక్కుతుందో తేలుతుంది.
కొత్త పీఆర్సీ జీతాలు, ఇతర అవసరాలు తీర్చడంతో రూ.2,400 కోట్ల వరకూ ఓవర్‌డ్రాఫ్టులో రాష్ట్రం ఉన్నట్లు ఆర్థికశాఖ నుంచి అందిన సమాచారం. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్టు వెసులుబాటు, మరికొన్ని నిధులు కలిపి ఇటీవల జీతాలు, పింఛన్లు చెల్లించినట్లు తెలిసింది. 4 రోజుల్లో ఓడీ నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థికశాఖ అధికారి ఒకరు దిల్లీ వెళ్లి రుణ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇంతవరకు చివరి త్రైమాసికానికి రుణ అనుమతులు లభించిన దాఖలాలు లేవు.
ఇదీ చదవండి..
RTC: సమ్మెకు ఆర్టీసీ సంఘాలు సై.. నేడు, రేపు డిపోల వద్ద ధర్నాలు