ETV Bharat / city

'లాక్​డౌన్​ పాక్షిక సడలింపులు.. నిబంధనలు తప్పనిసరి'

రాష్ట్ర ప్రభుత్వం జూన్​ 30వ తేదీ వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తూనే పాక్షికంగా సడలింపులు ఇచ్చింది. రాష్ట్రంలో దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలతో పాటు మాల్స్​, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వైద్య సేవలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

'లాక్​డౌన్​ పాక్షిక సడలింపులు.. నిబంధనలు తప్పనిసరి'
'లాక్​డౌన్​ పాక్షిక సడలింపులు.. నిబంధనలు తప్పనిసరి'
author img

By

Published : Jun 6, 2020, 3:41 PM IST

రాష్ట్రంలో దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలతో పాటు మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సేవలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి వీటిని తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.

జూన్ 30వ తేదీ వరకూ లాక్​డౌన్ కొనసాగుతుందని ప్రకటిస్తూనే వీటికి పాక్షికంగా సడలింపులు ఇచ్చింది. కంటైన్మెంటు జోన్లు మినహా అన్నిచోట్లా మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలకు అనుమతి మంజూరు చేసింది.

మార్గదర్శకాలివే..

  • కంటైన్మెంటు జోన్ల వెలుపల మాత్రమే షాంపింగ్, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి.
  • 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి లేదు.
  • ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై ఇప్పటికీ నిషేధం ఉంది.
  • షాపింగ్ మాల్స్ లో శీతలీకరణ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలని స్పష్టం.
  • దేవాలయాల వద్ద క్యూ మేనేజ్​మెంట్ సవ్యంగా ఉండాలి.
  • ధార్మిక ప్రదేశాల్లో ఎక్కడా బహిరంగంగా ఉమ్మి వేసేందుకు లేకుండా చర్యలు తీసుకోవాలి.
  • దేవాలయాల్లో విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా చూడాలి.
  • తీర్థ ప్రసాదాలను పంచేందుకు.. పవిత్ర జలాలను భక్తులపై చల్లకుండా చూడాలి.
  • సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు.
  • ప్రార్థనా మందిరాల్లో ఎవరికి వారు కిందకూర్చునే వస్త్రం లేదా తివాచీని తెచ్చుకోవాలి.
  • హోటళ్లలో డిజిటల్ చెల్లింపులు, ఇ-వాలెట్ లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
  • షాపింగ్ మాల్ ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలి.
  • ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలి.
  • హోటళ్లు, రెస్టారెంట్లలోని టేబుళ్లు, కుర్చీలు వినియోగదారుడు మారిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి.
  • గేమింగ్ ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసిఉంచాలని స్పష్టం.
  • షాపింగ్ మాల్స్ లోని సినిమాహాళ్లు మూసి ఉంచాల్సిందిగా ఆదేశాలు.

కేంద్రం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆలయాలకు వచ్చే భక్తులు, వినియోగదారులు వ్యక్తిగతంగా మాస్కు ధరించడం సహా చేతుల పరిశుభ్రతను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి..

ముదిరిన వివాదం.. ప్రైవేటు కళాశాలలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.