GOV ADVISORS: ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయ కల్లం, జీవీడీ కృష్ణమోహన్, శ్యామ్యూల్, పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ.. రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 2022 జూన్ 7 నుంచి మరో ఏడాది పాటు ప్రభుత్వ సమాచార సలహాదారుగా కృష్ణమోహన్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీకాలాన్ని 2022 జూన్ 18 నుంచి మరో సంవత్సరం కాలం పొడిగిస్తున్నట్టు తెలిపింది. ముఖ్యమంత్రి సలహాదారు శామ్యూల్ పదవీకాలాన్ని జూన్ 22 నుంచి ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పదవీ కాలాన్ని.. జూన్ నాలుగో తేదీ నుంచి సంవత్సరం పొడిగించినట్లు వివరించింది.
ఇవీ చదవండి: