సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాది పాటు 30 శాతం హెచ్‌ఆర్ఏ, సీసీఏ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విభాగాధిపతులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగులకూ ఈ ప్రయోజనం కల్పించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి వచ్చినవారికి మరో ఏడాది 30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వనుండగా.. హైదరాబాద్‌లో ఉన్నవారికి, కొత్తవారికి హెచ్ఆర్ఏ వెసులుబాటు వర్తించదని వెల్లడించింది.
ఇదీ చూడండి..
సీమ ఎత్తిపోతలకు బ్రేక్... ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ