ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవటంతో రేపటి నుంచి సహాయ నిరాకరణకు వెళ్లాలని ఏపీ జెన్ కో ఉద్యోగుల నిర్ణయం తీసుకుంది. జనవరి నెలకు చెందిన వేతనాలను ఇప్పటి వరకూ చెల్లించకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జనవరి నెలకు సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వం వేతనాలను చెల్లించకపోవటంంతో ఏపీ జెన్ కో కు చెందిన సంస్థల్లో సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు ఇంధన శాఖ కార్యదర్శికి ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ లేఖ రాసింది. వేతనాలు చెల్లించే వరకూ సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.
ఎండీ కార్యాలయం ముట్టడి..
ఈరోజు విద్యుత్ సౌధలో ఏపీజెన్కో ఎండీ కార్యాలయాన్ని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. తక్షణమే ఈ నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దని నినాదాలు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జెన్కో ప్లాంట్లలోని సీఈ కార్యాలయాల ముందు కూడా విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
Special Status: ప్రత్యేక హోదా లేదు.. నిధుల సమీకరణకు కృషి చేయండి: భాజపా ఎంపీ జీవీఎల్