రాష్ట్రంలో గత 24 గంటల్లో 48,518 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 238 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 279 మంది పూర్తిగా కోలుకోగా.. వైరస్ ధాటికి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 59 మంది, శ్రీకాకుళం నెల్లూరులలో అత్యల్పంగా నలుగురు.. మహమ్మారి బారిన పడ్డారు. కృష్ణా గుంటూరుల్లో 32, పశ్చిమ గోదావరిలో 22, విశాఖలో 21, కడపలో 16, తూర్పు గోదావరిలో 15, కర్నూలు అనంతపురంలలో 11, ప్రకాశంలో 6, విజయనగరంలో 5 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,19,32,603 నమూనాలను పరిశీలించగా.. మొత్తం 8,82,850 మందికి కరోనా నిర్ధరణ జరిగినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 8,72,545 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోగా.. 3,194 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. 7,111 మంది కొవిడ్ ధాటికి మృతి చెందారని తెలిపింది.
ఇదీ చదవండి:
'భర్త ఉంటే భార్య ఉండకూడదు.. భార్య ఉంటే భర్త ఉండకూడదంట సార్..?'