రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 1,08,616 మందికి పరీక్షలు చేయగా.. 6,952 మందికి వైరస్ సోకింది. మహమ్మారికి మరో 58 మంది బలయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 9, తూ.గో.జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు.
చిత్తూరు జిల్లాలో 1,199, తూ.గో. జిల్లాలో 1,167 కరోనా కేసులు నమోదవగా.. ప.గో. జిల్లాలో 663, ప్రకాశం జిల్లాలో 552 కరోనా కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చదవండి: Brahmamgari Matham: అలజడులు సృష్టించేందుకు శివస్వామి కుట్ర.. డీజీపీకి మహాలక్ష్మీ లేఖ