రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,716 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 379 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
కృష్ణాలో అత్యధికంగా 84.. విజయనగరంలో అత్యల్పంగా నలుగురికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. చిత్తూరులో 64, గుంటూరులో 46, తూర్పు గోదావరిలో 35, కడపలో 33, విశాఖపట్నంలో 32, అనంతపురంలో 19, శ్రీకాకుళంలో 16, నెల్లూరులో 15, ప్రకాశం పశ్చిమగోదావరిలో 13, కర్నూలులో ఐదుగురు వైరస్ బారిన పడ్డారు.
మొత్తంగా ఇప్పటివరకు 1,14,15246 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. 8,79,718 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 8,68,769 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 7,085 మంది మృతి చెందారని వివరించింది. 3,864 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:
దేవుడి సాక్షిగా.. అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఏమని ప్రమాణం చేశారంటే?