ETV Bharat / city

గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష

విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని అమరావతికి తిరిగి వచ్చిన సీఎం జగన్...గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Aug 5, 2019, 5:41 PM IST

Updated : Aug 5, 2019, 6:20 PM IST

గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష
గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష

గోదావరి వరదలు, ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ సమీక్షించారు. ముంపు బాధితులకు తక్షణమే సాయం అందించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. విదేశీ పర్యటనను ముగించుకుని అమరావతికి వచ్చిన సీఎం...తాడేపల్లిలోని తన నివాసంలో మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. హోంమంత్రి సుచరిత, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కారణాలపై అధ్యయనం
ధవళేశ్వరం వద్ద నీట మట్టం 2,3 ప్రమాద హెచ్చరికలు దాటినప్పుడే దేవీపట్నం మండలంలోని గ్రామాలు ముంపునకు గురవుతాయని, ప్రస్తుతం ఒకటో ప్రమాదస్థాయికి చేరకముందే ముంపునకు గురయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముంపునకు కారణాలను అధ్యయనం చేయాలని, సహాయ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గడచిన 5-6 రోజుల్లోనే సుమారు 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు అంచనా వేశామన్నారు.

3 రోజుల్లో సాధారణం
వచ్చే 2 రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కొనసాగే అవకాశాలున్నాయని, మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తుండడంవల్ల ఈ పరిస్థితి ఉంటుందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు లేవని, వచ్చే వారం రోజులపాటు వర్షసూచన లేదని సీఎంకు వివరించారు. 3 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు.

వైద్య శిబిరాలు ఏర్పాటు
బాధిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించాలని సీఎం సూచించారు. సకాలంలో సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, పశువైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చూడాలన్నారు.

ఇదీ చదవండి : రేపు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పాచిపెంట మక్కువ సాలూరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎంపికచేసిన గ్రామీణ విద్య వాలంటీర్లకు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ప్రారంభించారు
ఈ శిక్షణ ఎంపీడీవో ఆధ్వర్యంలో ఒక్కో మండలంలో 15 పంచాయతీలు చొప్పున రెండు విడతలుగా శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు ఒక బ్యాచ్ కి రెండు రోజులు లో శిక్షణ పూర్తి చేస్తారు
ఈ లో అంశంగా గ్రామాల్లో విధులు ఎలా నిర్వహించాలి అంశంపై వారికి శిక్షణ లో ఇస్తున్నారు
ఈ అంశంపై విజయనగరం వెళ్లే అక్కడ శిక్షణ పొంది వారు గ్రామ వాలంటీర్లకు ఇచ్చట శిక్షన్ ఇస్తున్నారు

Body:hui

Conclusion:jjj
Last Updated : Aug 5, 2019, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.