ETV Bharat / city

"వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత" - 50 శాతం వారికే నామినేటెడ్‌ పోస్టులు

వైఎస్సార్‌ చేయూత పథకం కింద... 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా 18 వేల750 రూపాయలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు.

jagan
author img

By

Published : Aug 29, 2019, 3:02 PM IST

Updated : Aug 29, 2019, 7:33 PM IST

సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం వై.యస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, అంజాద్ బాష, మంత్రి పినిపె విశ్వరూప్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల పరిధిలోని హాస్టళ్లు, విద్యాసంస్థల పరిస్ధితులపై సీఎం సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అక్కడ అందుతోన్న సదుపాయాలను, సమస్యలను అడిగారు.

పాఠశాలలకు 9 రకాల సౌకర్యాలు

రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో క్వాలిటీ ఉండాలని, అధికారులు ఈ అశంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా వాటిని పరిశీలించడం సహా తనిఖీలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడాలని చెప్పారు.స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించామని సీఎం తెలిపారు. మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్‌మన్‌ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారమ్స్, పుస్తకాలు అందాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని సూచించారు. నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో కచ్చితంగా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని... ఈ విషయాన్ని కలెక్టర్లకూ స్పష్టంగా చెప్పాలని సూచించారు.

2020 నుంచి చేయూత

45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా 18 వేల750 రూపాయలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ చేయూత కింద లబ్దిదారులను గుర్తించే పని మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ వైయస్సార్‌ చేయూత అందించాలని సూచించారు.

గిరిజనులకు వరాలు

గిరిజన ప్రాంతాలైన సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ, పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్‌.పురం, దోర్నాల కలిపి మొత్తం 7 చోట్ల సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ఆమేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. గిరిజనులకు అటవీభూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని .. ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి దృష్టిపెట్టాలని ఆదేశించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం.. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆదేశించారు.

Intro:AP_VJA_13_29_COLLEGES_BANDH_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్ లో భాగంగా విజయవాడలో కళాశాలల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బకాయి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ కళాశాలల్లో రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్ చాన్సలర్ ,ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులు కల్పించాలని ,ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ,కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బైట్స్... విద్యార్థి సంఘాల నాయకులు

Body:AP_VJA_13_29_COLLEGES_BANDH_AVB_AP10050

Conclusion:AP_VJA_13_29_COLLEGES_BANDH_AVB_AP10050
Last Updated : Aug 29, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.