ETV Bharat / city

'డిసెంబరు 31లోగా నివర్ నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం'

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం డిసెంబరు 31లోగా నష్టపరిహారాన్ని చెల్లించనుంది. ఇందుకోసం డిసెంబరు 15 కల్లా నష్టపరిహారాన్ని నిర్ధారించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించింది. దీంతో పాటు డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. నివర్ తుపాన్​పై మంత్రివర్గంలో చర్చించామని... పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకునేందుకు సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు.

cm jagan
cm jagan
author img

By

Published : Nov 27, 2020, 3:24 PM IST

Updated : Nov 28, 2020, 2:32 AM IST

కేబినెట్ భేటీలో నివర్ తుపాన్​పై చర్చ

నివర్ తుపానుపై మంత్రివర్గంలో చర్చించామని రాష్ట్ర వ్యవయసాయశాఖ మంతి కన్నబాబు తెలిపారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైదని వివరించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని... ఎత్తు ఒక్క సెంటీమీటర్‌ కూడా తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

'తుపాన్ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 28.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 10 వేలమందికి పైగా సహాయ శిబిరాలకు తరలించాం. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 1300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనాల రూపకల్పన చేయాలి సీఎం ఆదేశించారు. డిసెంబర్ 31 కల్లా పరిహారం చెల్లిస్తాం. అంగన్‌వాడీ, హోంగార్డుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించాం.' - కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించామని వివరించారు. తొలిదశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్న ఆయన.... 2022 జూన్‌ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు. అర్హులైన మహిళలకు మేకలు, గొర్రెలు ఇవ్వాలని నిర్ణయించామని ...యూనిట్‌కు 14 మేకలు లేదా గొర్రెలు ఉంటాయన్నారు. ఈ పథకాన్ని డిసెంబరు 10న సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. పశువుల దాణాను కల్తీ చేస్తే జరిమానా, జైలుశిక్ష విధించేలా బిల్లు తీలసుకొస్తామని... పశువుల ఆరోగ్యం బాగుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ఆక్వా రంగం అభివృద్ధికి ఏపీ ఫిషరీస్‌ చట్టం తెస్తున్నామన్నారు.

వేతనాలు చెల్లిస్తాం...

కరోనా కారణంగా ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్‌, జనవరి నెలల్లో చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కోత విధించిన వేతనాలకు రూ.2,324 కోట్లు, పింఛనుదారులకు రూ.482 కోట్ల చెల్లింపులు చేస్తామన్నారు.

ఏపీ గేమింగ్‌ యాక్ట్‌-1974కు సవరణ

రైతుల భూములు వివాద రహితంగా ఉండేందుకు సాంకేతిక సహకారంతో భూముల రీసర్వే చేపడతామని.. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 21న సీఎం ప్రారంభిస్తారని కన్నబాబు వివరించారు. ఆక్వారంగం అభివృద్ధికి ఫిషరీస్‌ చట్టం తీసుకొచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఏపీ గేమింగ్‌ యాక్ట్‌-1974 చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొస్తామన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్లుల కోసం అభివృద్ధి కార్పొరేషన్‌, పల్నాడు ప్రాంతంలో కరవు నివారణకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని కన్నబాబు వివరించారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం జరుగుతుందని.. ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించబోమనే విషయాన్ని ఆ శాఖ మంత్రి స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.

ఇదీ చదవండి

'రాయలసీమ ఎత్తిపోతల పనులకు అనుమతివ్వండి'

Last Updated : Nov 28, 2020, 2:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.