2024 ఎన్నికలే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా నియమించిన జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలోనే భాజపా జోక్యం చేసుకుంటుందని.. రాష్ట్ర రాజధాని విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తేనే.. ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారని అన్నారు. అమరావతిపై చంద్రబాబు హామీల్లో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు.
కుటుంబ పాలన మారుస్తాం
రాష్ట్రంలో కుటుంబ పాలన మార్చేందుకు గట్టి పోరాటం చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తెదేపా, వైకాపాలు రెండూ కుటుంబ పార్టీలేనన్న ఆయన.. భాజపా మాత్రం సకల జనుల పార్టీ అని అన్నారు. ఏపీలో భాజపా జనసేన కలిస్తే 25 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ పేరుతో భూములు కొని కమీషన్లు లాక్కొంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు.
ఇదీ చూడండి..