రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని సూచించారు. హిందుత్వాన్ని పరిరక్షిస్తారా లేదా అనే విషయాన్ని తేల్చి చెప్పాలని ప్రశ్నించారు.
దేవాలయాల్లో జరుగుతున్న పరిణామాలపై భాజపా తరపున ఒక కమిటీ వేస్తామని ప్రకటించారు.అంత్యర్వేది ఘటన పై తెదేపాకు మాట్లాడే హక్కు లేదన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో ఎన్నో దేవాలయాలను తెదేపా ప్రభుత్వం కూల్చి వేసిందని ధ్వజమెత్తారు. అంతర్వేది ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ సీఎం జగన్కు లేఖ రాసినట్లు సోము వీర్రాజు చెప్పారు.
ఇదీ చదవండి: