రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈనెల 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా హిందువులు ఉత్సాహంతో, భక్తితో జరుపుకొనే కుటుంబ పండుగ దసరా అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా తమ సొంతూళ్లకు వెళ్లి ఇంటిల్లిపాది బంధువులను కలుసుకోవడం సంప్రదాయమని- ఈ పండుగ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రేమతో కలిసే సమయమని లేఖలో పేర్కొన్నారు.
సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 26న ఐచ్చిక సెలవుగా ప్రకటించిందని... అది కూడా మహిళలకు మాత్రమే అని నిబంధన విధించడం సరికాదన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించి ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి